suraksha camp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఇందిరమ్మ కాలనీలో సురక్షా క్యాంపు పాల్గోన్న మంత్రి వనిత

జగనన్న సురక్ష కార్యక్రమంతో చిన్న చిన్న ఇబ్బందులతో ఉన్న ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అందుతుందని రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. శనివారం కొవ్వూరు టౌన్ ఇందిరమ్మ కాలనీలో, కొవ్వూరు రూరల్ మండలంలో వేములూరు, తొగుమ్మి గ్రామాల్లో నిర్వహించిన జగనన్న సురక్ష క్యాంపుల్లో ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో భాగంగా 11 రకాల సేవల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ధృవపత్రాలను హోంమంత్రి తానేటి వనిత అందించారు. తొగుమ్మి గ్రామంలో కార్యక్రమం ముగిసిన అనంతరం వర్షంలో కూడా హోంమంత్రి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.  

ఈ సందర్బంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి నూరు శాతం పథకాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 99 శాతం మంది అర్హులకు పథకాలు అందుతున్నాయని, మిగిలిన ఒక్క శాతం అర్హులకు కూడా జగనన్న సురక్ష పథకం ద్వారా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.