గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. భారీ వరదతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఇన్‌ఫ్లో అధికంగా వస్తుండటంతో ఆయా ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు వరద పోటు అధికంగా ఉంది. హుస్సేన్ సాగర్ డేంజెర్ బెల్స్ మోగిస్తోంది. తీవ్రస్థాయిలో హుస్సేన్‌సాగర్‌కు వరద తీవ్రస్థాయిలో పోటెత్తుతోంది. ఎడతెరిపిలేని వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. బంజారా, పికెట్, కూకట్‌పల్లి నాళాల నుంచి హుస్సేన్‌సాగర్‌లోకి 40 వేల క్యూసెక్కుల వరద వచ్చిచేరుతోంది.
హుస్సెనసాగర్‌లో నీటి మట్టం ఫుల్‌ట్యాంక్ లెవెల్ దాటింది. హుస్సేన్‌సాగర్ ప్రస్తుత నీటి మట్టం 513.62 మీటర్లుగా ఉంది. అలాగే హుస్సెన్‌సాగర్ ఫుల్‌ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లుగా ఉంది. తూముల ద్వారా హుస్సేన్‌సాగర్ నుంచి 5800 క్యూసెక్కుల నీటిని మూసిలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. అలాగూ ఉస్మాన్‌సాగర్‌కు కూడా వదర తాకిది అధికంగా ఉంది. ఉస్మాన్‌సాగర్ ఇన్ ఫ్లో 800 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1785.65 అడుగులకు చేరింది
మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాలో ఐఎండీ (IMD) రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈనెల 24న మరో అల్ప పీడనం ఏర్పడనుందని.. రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి మెదక్‌లలో భారీగా వర్షా