ktr
తెలంగాణ రాజకీయం

వరి నారుతో కేటీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు పాలకుర్తి జెడ్.పి.టి.సి కందుల సంధ్యారాణి

పాలకుర్తి మండలం  లింగాపూర్  గ్రామంలో ఇండ్ల నరేష్-స్వప్న పొలంలో కేటీఆర్ పై ఉన్న అభిమానాన్ని జడ్పీటీసీ  కందుల సంధ్యారాణి , రైతులతో కలిసి వినూత్నంగా  తెలియజేశారు. ఇటీవల రైతు బందు , రైతుబీమా పథకాలతో కాళేశ్వరం లాంటి మహా ప్రాజెక్ట్ నిరంతరం ఉచిత కరంటుతో రైతుల కష్టాలు తీర్చిన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర  ఐటీ, పురపలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారరామారావు జన్మదినం పురస్కారించుకొని వినూత్న తరహాలో శుభాకాంక్షలు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ సంక్షేమ ఫలితాల వల్లనే రైతులు ఈరోజు ఆనందంగా ఉన్నారని తెలియజేస్తూ కందుల సంధ్యారాణి ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రైతులు వరినాట్లతో హ్యాపీ బర్త్డే  కేటీఆర్ అనీ అక్షరాలు వరినాట్లు నాటి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కందుల సంధ్యారాణి  మాట్లాడుతూ రైతులు  సుఖసంతో షాలతో ఉన్నారంటే  బిఆర్ఎస్ పార్టీ కేసిఆర్ పాలన అన్నారు తండ్రి కి తగ్గ తనయు డిగా పాలనలో, ప్రజాసేవలో ముందుకు వెళ్తున్న కేటీఆర్ రైతుల, ప్రజా దీవెనలు అందుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు కేటీఆర్ అందుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో సరోజ శారధ భాగ్య శ్యామల అమీన విజ్జక్క, రమ, లచ్చమ్మ,సత్తమ్మ సరోజన,సునీత ,హరీష్,ప్రశాంత్,బబ్లు తదితరులు పాల్గోన్నారు.