ముఖ్యమంత్రి,ప్రధానమంత్రి స్ధాయీలలో కూడ తన మాట చెల్లుబాటు అయినప్పటికీ,డబ్బు మూఠలకు, స్వార్థపు పబ్బాలకు తావీయని త్యాగ మూర్తి, నిస్వార్థ నాయకుడు పనకంటి కిషన్ రావు అని మంథని విద్యార్థి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కొండేల మారుతి పేర్కొన్నారు.
మంథని క్రియాశీలక రాజకీయాల లో భీష్మాచార్యులుగా ప్రసిద్ధి చెందిన పనకంటి కిషన్ రావు 96 వ జయంతిని సోమవారం మంథని విద్యార్థి యువత కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి, స్వాతంత్ర్య సమర యోధుడి గా, సోషలిస్టు నేత గా వారీ జీవనశైలి గురించి పలువురు వక్తలు ప్రశంసిస్తూ ప్రసంగించారు. మంథని పంచాయతీ సమితి అధ్యక్షులుగా నాలుగు పర్యాయాలు,అవిభక్త కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఆయన చేసిన సేవలు
బహూళ ప్రశంసనీయమని పలువురు విభిన్న అంశాలను ప్రస్తావించారు.
మాజీ ప్రధాని పివి సహాచర మిత్రుడు గా అత్యంత ఆప్తుడిగా జగమెరిగిన కిషన్ రావు స్మృత్యర్థం గా తగు రీతిలో నామకరణం అలాగే నిర్మాణాల ను చేపట్టే క్రియశీలక అంశాలలో తగు భాద్యతలు మోస్తామని కొండెల మారుతి ప్రకటించారు. స్వర్గీయ పనకంటి కిషన్ రావు తనయుడు పనకంటి చంద్రశేఖర్ విశిష్ట అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు కొండపాక సత్యప్రకాశ్, బిఆర్ఎస్ నాయకులు రామడుగు మారుతి రావు, తాటి బుచ్చన్న గౌడ్, ఆర్ఆర్ మీడియా యండి మేడగోనీ రాజమౌళి గౌడ్, మైనారిటీ నాయకులు షరీఫోద్దీన్, విశ్రాంత గెజిటెడ్ హెచ్ యం మాడీశెట్టి శ్యాంసుందర్, గాయకుడు చిన్నబాపు ,కాంగ్రెసు నాయకులు టక్కెగారి కిట్టన్న లు పాల్గొన్నారు.