ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గురువారం ఉదయం ప్రాజెక్టుకు 1,80,648 ఇన్ ఫ్లో ఉండగా..26గేట్లు ఎత్తి 1,50,025 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 27,316 క్యూసెక్కులతో పాటు నెట్టెంపాడుకు 750, జూరాల ఎడమ కాలువకు 820, జూరాల కుడికాలువ 682, వరద కాలువకు 800, భీమా లిఫ్టు-2కు 855 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
మొత్తంగా జూరాల ప్రాజెక్టు నుంచి 1,80,428 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదు అవుతున్నది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 8.048 టీఎంసీల స్థాయిలో నిల్వ ఉంచి ఎగువ నుంచి వచ్చిన వరదను నేరుగా విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి వరద కొనసాగుతూనే ఉండడంతో త్వరలోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.