ఐఎన్టియుసి కొత్తగూడెం ఏరియా కార్యదర్శిగా కిష్టారం గ్రామానికి చెందిన నరుకుల్ల అప్పారావుని నియమిస్తూ ఐఎన్టియుసి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ జనక్ ప్రసాద్ గారు హైదరాబాదులోని కేంద్ర కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు.దీనిని ఉద్దేశించి అప్పారావు మాట్లాడుతూ ఈ నియామకానికి సహకరించిన కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి గారికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ నున్న రామకృష్ణ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు