srisailam
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరింది. మరో వైపు  ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పోటెత్తుతోంది.  జూరాల ప్రాజెక్టు నుండి 52,856 క్యూసెక్కులు, హంద్రీ నుండి 117 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. శ్రీ శ్రీశైలం జలాశయం నీటిమట్టం గురువారం ఉదయం 6 గంటల సమయానికి 816.20 అడుగులకు చేరింది.  నీటి నిల్వ సామర్థ్యం 38.1234 టీఎంసీలుగా నమోదైంది.