revanth
తెలంగాణ రాజకీయం

వరద ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు చేపట్టండి

మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు. గ్రేటర్ హైదరాబాద్ లో వరదలు, పై లేఖలో ప్రశ్నించారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం విలవిలలాడుతోంది. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది.  ప్రజల గోసను పట్టించుకోవాల్సిన మీరు పత్తా లేకుండా పోయారు. పుట్టిన రోజు పండగలపై ఉన్న ఆసక్తి ప్రజల ఇబ్బందులపై లేదు  విశ్వనగరంగా తీర్చిదిద్దామని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి  పోటి పడే మీరు, ప్రజలు బయటకు రావాలంటేనే ఆలోచించుకునే దుస్థితిని హైదరాబాద్ కు కల్పించారని అన్నారు.
జలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుంటూ తిరిగాల్సిన పరిస్థితిని కల్పించారు.  మీ అసమర్ధ పాలనలో ఇది విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది. ట్రాఫిక్ సమస్యలతో నగర ప్రజలు నానా యాతన పడుతున్నారు.  బీఆరెస్ నేతల కబ్జాలు, అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలతోనే నగరానికి ఈ పరిస్థితి. చర్యలు తీసుకోవాల్సిన మీరు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.  

హైదరాబాద్ లో ఇటువంటి పరిస్థితి రాబోతుందని మేం హెచ్చరించినా పట్టించుకోలేదు. నగరంలో  వరద బీభత్సం సృష్టిస్తున్నా  కనీసం సమీక్ష  చేసే సమయం మీకు లేదు.  వాతావరణ శాఖ  రెడ్ అలెర్ట్ ప్రకటించైనా.. ఎలాంటి  చర్యలు తీసుకోవడం లేదు. గతంలో వరదల సమయంలో మీరు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అప్పట్లో ప్రకటించిన పది వేల సాయం ఎన్నికల పథకంగా మిగిలిపోయింది.  ఇప్పటికైనా ప్రజల కష్టాలను తీర్చే ప్రయత్నం చేయండి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయ చర్యలు చేపట్టండి. ప్రభావిత ప్రజలకు రూ. 10 వేల సాయం ప్రకటించండి. లేకపోతే శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.  మీ చేతగానితనాన్ని ఎండగట్టి తగిన బుద్ధి చెబుదామని పేర్కోన్నారు.