bc
తెలంగాణ రాజకీయం

బిసిలకు అండగా నిలిచిన "జీవన్" సన్మానించిన బి.సి.నేతలు

ఉన్నతవర్గానికి చెందినా బిసీల రిజర్వేషన్ల పెంచాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వాలకు వినిపించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బిసి సంఘం నేతలు ఘనంగా సన్మానించారు. శనివారం బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చింతల గంగాధర్, సహా కార్యనిర్వాహక కార్యదర్శి అలిశెట్టి ఈశ్వరయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు జీకూరీ శ్రీహరి, యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జాజాల రమేష్, నియోజకవర్గ అధ్యక్షులు తిరుపురం రాంచందర్, జిల్లా కార్యదర్శి అనుమల్ల సంజయ్ సామ్రాట్ లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి శాలువాతో ఘనంగా సన్మానించారు.

అనంతరం లక్ష్మీ నారాయణతోపాటు పలువురు మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్న బిసిలకు కేవలం 25 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం అన్యాయమని లోకానిక్ చాటారన్నారు. మిగతా రాజకీయ పార్టీలు జీవన్ రెడ్డి బాటలోకి రావాలని పిలుపునిచ్చారు. వివిధ పార్టీల్లో బిసి నాయకుల్లా పనిచేస్తున్న, మంత్రులుగా చెలామణి అవుతున్న ఎవరు బిసి రిజర్వేషన్ల పై మాట్లాడకపోవడంతోనే బిసిలకు అన్యాయం జరుగుతోందన్నారు. తనదైన శైలిలో స్పందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడిన తీరుతోనైన బిసి నాయకులు, ప్రజాప్రతినిధులు స్పృహలోకి రావాలని వారు కొరారు.