dammaiguda-2
తెలంగాణ రాజకీయం

అన్ని కాలనీలలో అభివృద్ధికి కృషి

ప్రతి వార్డులో మౌలిక వసతులు కల్పిస్తూ కృషి చేస్తున్నానని చైర్పర్సన్ ప్రణీత గౌడ్ అన్నారు, చైర్పర్సన్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 10వ వార్డులో 20 లక్షల రూపాయల సాధారణ మున్సిపల్ నిధులతో సిద్ధార్థ నగర్ కాలనీ ఫేసు 2, వెంకటరమణ కాలనీ ఫేసు 2, స్ట్రీట్ నెంబర్ 01 లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ శ్రీలత మాట్లాడుతూ పరిధిలోని అన్ని కాలనీలలో మౌలిక వసతులు కల్పిస్తూ, వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్నాఅన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ రాజమల్లయ్య, డిఈఈ చిరంజీవిలు, దమ్మాయిగూడ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ముప్పా రామారావు కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.