వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.99.75 మేర తగ్గించాయి. తగ్గిన ధరలు నేటినుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. అయితే గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు. చివరిసారిగా ఈ ఏడాది మార్చి 1న వంటగ్యాస్ సిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ హైదరాబాద్‌లో రూ.1155కు లభిస్తున్నది.తాగా తగ్గిన ధరలతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1680కు చేరింది. కోల్‌కతాలో రూ.1802.50, ముంబైలో రూ.1640.50, చెన్నైలో రూ.1852.50గా ఉన్నది. కాగా, జూలై నెల ఆరంభంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.7 మేర పెరిగిన విషయం తెలిసిందే.