దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని, ఇవి ఆఫర్ చేసే డిగ్రీ సహా వివిధ కోర్సుల్లో విద్యార్థులు చేరవద్దని యూజీసీ హెచ్చరించింది. 20 నకిలీ యూనివర్సిటీల పేర్ల జాబితాను విడుదల చేసింది.
ఫేక్ వర్సిటీలు ఇవే..
ఢిల్లీ-ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్, కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, వొకేషనల్ యూనివర్సిటీ, ఏడీఆర్ సెంట్రిక్ జ్యురిడికల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్, ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ
☞ యూపీ-గాంధీ హిందీ విద్యాపీఠ్, నేషనల్ యూనివర్సిటీ ఫర్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ), భారతీయ శిక్షా పరిషద్
☞ ఏపీ- క్రిస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా
☞ బెంగాల్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రిసెర్చ్
☞ కర్ణాటక- బడగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ
☞ పుదుచ్చేరి- శ్రీ బోది అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్
☞ కేరళ- సెయింట్ జాన్స్ యూనివర్సిటీ
☞ మహారాష్ట్ర- రాజా అరబిక్ వర్సిటీ