tekula gudem
జాతీయం ముఖ్యాంశాలు

టేకులగూడెం లో భారీ కూంబింగ్

సుక్మా-బీజాపూర్ సరిహద్దు టేకులగూడెం అటవీ ప్రాంతం లో భద్రతాదళాలు భారీ ఎత్తున గాలింపు లు చేపట్టాయి. బుధవారం పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన  ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. 14 మంది జవాన్లకు గాయాలు అయ్యాయి. డీఆర్జీ, కోబ్రా దళాలు టేకులగూడెం సమీపంలోని జోనగూడ-అలిగూడ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఎన్కౌంటర్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా గాయాలపాలైన జవాన్లను హెలికాప్టర్ ద్వారా రాయపూర్ తరలించారు. భద్రతా బలగాల కోసం బుధవారం  టేకులగూడెంలో కొత్త క్యాంపును ప్రారంభించారు. 2021 వ సంవత్సరంలో ఇదే ప్రాంతంలో మావోయిస్టుల మెరుపు దాడిలో 23 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.