chandra
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

చంద్రబాబు భయస్థుడు

మనం కొదమ సింహాలమా, వృద్ధ సింహాలమా.. గ్రామ సింహాలమా అనేది ప్రజలు తేలుస్తారని కడప ఎంపీ వైఎస్ అవినాసష్ రెడ్డి వ్యాఖ్యా నించారు. పులివెందుల పర్యటనలో బుధవారం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు భయస్తుడు కాబట్టే తాను ధైర్యవంతుడిని అని చెప్పుకునేందుకు మాటిమాటికి కొదమ సింహం అని అంటున్నాడని ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులను సందర్శిం చేందుకు ఆయన ఏ ధైర్యంతో వస్తున్నాడో అర్ధంకా వడంలేదన్నారు. ఒక అబద్ధాన్ని కళ్లు ఆర్పకుండా చెప్పగలిగే వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఆయన ఇం కా ఏమన్నారంటే.. 11వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వల్ల రాయల సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు నీరు అందించలేమని భావించి దాన్ని 44వేల క్యూసెక్కుల సామర్ధ్యానికి పెంచిన ఘనత మహా నేత డాక్టర్ వైఎస్సార్.

దీనిని అడ్డుకునేందుకు అప్పట్లో ధర్నాలు చేయించిన విషయం బాబు మరి చిపోయినా ప్రజలు మర్చిపోలేదు. అలాగే, గండి కోట రిజర్వాయర్ సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు కుదించిన ఘనుడు చంద్రబాబే. వైఎస్సార్ వచ్చాక 27టీఎంసీలుగా చేశారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులో ఎన్నడూ పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపిన దాఖలాల్లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక 27 టీఎంసీల పూర్తి సామ ర్థ్యాన్ని నింపి సీమకు నీళ్లిస్తున్నారు. నిర్వాసితులకు రూ.950కోట్ల పరిహారం ఇవ్వబట్టే ఇది సాధ్యమైంది. అలాగే, చిత్రావతి ప్రాజెక్టు కూడా తన 14ఏళ్ల పాలనలో ఏనాడూ సీమ ప్రాజెక్టుల గురించి పట్టిం చుకోని పెద్ద మనిషి చంద్రబాబని ఆరోపించారు.