congress
తెలంగాణ రాజకీయం

ఆ నేతలపై  అధిష్టానం ఫోకస్‌

కాంగ్రెస్ కీలక నేతలు పార్టీ మారుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఎవరు పార్టీ మారిన ఇబ్బందేం లేదనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. పార్టీ వీడిన, వీడుతున్న నేతల స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు టీపీసీసీ కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో పార్టీ వీడనున్నట్లు అనుమానం ఉన్న నేతల నియోజకవర్గాలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఫోకస్ పెంచింది. అయా నియోజకవర్గాల్లో పార్టీ లీడ్ చేయగలిగిన వారితో పాటు ఇతర పార్టీలలో బలంగా ఉన్న నేతలపై హస్తం పార్టీ చర్చలు మొదలుపెట్టిన తెలుస్తోంది.కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు భారీ చేరికలు కొనసాగుతున్నాయి. మరోవైపు పార్టీ నుండి కీలక నేతలు అధికార పార్టీలోకి జంప్ అవుతున్నారనే ప్రచారం కొనసాగుతోంది. కాంగ్రెస్ కీలక నాయకులను తమ పార్టీలో కలుపుకుంటే కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీయోచ్చని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

సరిగ్గా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులను తమ పార్టీలోకి తెచ్చుకుంటే కాంగ్రెస్ కి అభ్యర్థులు దొరకకుండా చేయొచ్చని కేసీఆర్ ప్లాన్ గా తెలుస్తోంది. కాంగ్రెస్ లోని పలువరు పెద్ద నేతలు కారు ఎక్కుతారని దానికి మానసికంగా సిద్దంగా ఉండాలని పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. అయితే ఆ ప్రచారమే నిజమైతే కాంగ్రెస్ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇప్పటి నుండే జాగ్రత్త పడుతోంది. పార్టీ నుండి ఎంత పెద్ద నేత వెళ్ళిపోయినా క్యాడర్ చేజారిపోకుండా ఉండేలా తమ యాక్షన్ ప్లాన్ ఉండేలా కాంగ్రెస్ స్కెచ్ రెడీ చేస్తోంది. ఒకవేళ కీలక నాయకులు వెళ్ళిపోయినా అక్కడి నుండి బలమైన నాయకుడిని నిలబెట్టి కాంగ్రెస్ వీడిన వారిని ఓడించాలని పార్టీ నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కారెక్కిన భువనగిరి డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ స్థానంలో ఎవరిని తీసుకోవాలనేదానిపై పార్టీలో ఆల్రెడీ చర్చ మొదలైనట్లు సమాచారం. కుంభం అనీల్ కాంగ్రెస్ నుండి భువనగిరిలో పోటీ చేస్తారని పార్టీ భావించింది. ప్రస్తుతం అనీల్ పార్టీ వీడడంతో భువనగిరి స్థానంలో చెప్పుకోదగ్గ లీడర్ లేడు. దీంతో కొత్త నేతలను వెతికే పనిలో టీ కాంగ్రెస్ బిజీ అయింది. మరోవైపు బీజేపీ నుండి బయటకు వొచ్చిన జిట్టా బాలకృష్ణ రెడ్డి, బీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర్ రెడ్డి లతో కూడా కాంగ్రెస్ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ ఇద్దరు కూడా టిక్కెట్ కన్ఫర్మేషన్ ఇస్తే కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేస్తామని చెప్పినట్లు సమాచారం.

దీంతో టీకాంగ్రెస్ నేతలు పునరాలోచనలో పడ్డారట. అయితే ఏదో ఓకటి తేల్చి ఓ వారంలో ఈ ఇద్దరిలో ఓకరిని పార్టీలోకి తీసుకునేందుకు పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న వారు కూడా అధికార పార్టీలోకి వెళ్తున్నట్లు జోరుగా ప్రచారం కొనసాగుతోంది. ఈ విషయంపై ఆ నేతలను క్లారిటీ అడగగా విషయం దాటవేస్తున్నారు తప్పా ఈ ప్రచారాన్ని ఖండించడం లేదు. సమర్థించడం లేదు. పీసీసీ చీఫ్ గా పని చేసిన ఒక కీలక నేత పార్టీ మారుతున్నట్లు ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. దాన్ని ఖండిస్తూ లేఖ గాటైనా లేఖను విడుదల చేసారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మీడియా ఏజెన్సీ కీలక నేత మరోవైపు ఒక తాజా ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే సైతం హస్తం పార్టీకి బైబై చెప్పి కారు ఎక్కడానికి సిద్ధమయ్యారని ఆయా నియోజకవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

బీఆర్ఎస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా మజ్లిస్ మద్దతు, అవసరమైతే బీజేపీ మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బీఆర్ఎస్ లోకి వెళ్దామని సదరు కాంగ్రెస్ నేతలు తమ క్యాడర్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు సమాచారం.అయితే కాంగ్రెస్ కీలక నేతలు పార్టీ మారుతున్నట్లు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. కానీ ఎన్నికల సమయం దగ్గర పడ్డాక ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా ఎవరైనా కాంగ్రెస్ నుండి వెళ్ళిపోయినా ఇబ్బంది పడకుండా అక్కడ ఎవరిని ప్రమోట్ చేయాలనే అంశంపై బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. పార్టీని వీడిన కీలక నేతల స్థానంలో పార్టీని లీడ్ చేయగల నేతలతో అధిష్ఠానం తన స్ట్రాటజీ చెబుతున్నట్లు సమాచారం. పార్టీ వీడే నేతలపై ఓ కన్నేసి ఉంచాలని తెలంగాణ కాంగ్రెస్ డిసైడ్ అయింది. ముఖ్య నేతలు పార్టీ వీడితే వారి స్థానాన్ని వెంటనే భర్తీ చేయాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ఎన్నికల వరకు ఈ వ్యవహారం ఏమవుతుందో చూడాలి.