PRC
తెలంగాణ

పీఆర్సీ పెంపు  ప్రకటనపై సీ ఎం.కు  పెన్షనర్ల కృతజ్ఞతలు.

దేశమే ఆక్షర్య పోయేలా త్వరలోనే  ఉద్యోగులకు,పెన్షనర్ల కు పీఆర్సీ  పెంపు ఇస్తామని ప్రకటించిన
ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.సోమవారం ఆయన  సంఘ కార్యాలయంలో మాట్లాడుతూ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటిస్తామని,ఉద్యోగులు,పెన్షనర్లు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములే నని, ఆర్థిక వనరులు సమకూరగానే మళ్ళీ జీతాలు పెంచుతామని , వాళ్లను బాగా చూసుకుంటామనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షులు వెలముల ప్రకాష్ రావు,ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు పూసాల ఆశోక్ రావు,కొయ్యడ సత్యనారాయణ,మహిళా కార్యదర్శి బి.కరుణ,నాయకులు నారాయణ,దేవేందర్ రావు,పబ్బా శివానందం,రాజ్ మోహన్,మురళీధర్, ఎం.డి.ఎక్బాల్,వేణుగోపాల్ రావు,సయ్యద్ యూసుఫ్,తదితరులు పాల్గొన్నారు.