ktr-medigadda
తెలంగాణ రాజకీయం

కాళేశ్వరం విశ్వరూపం చూపిస్తాం

మార్చి 1 నుంచి ‘చలో మేడిగడ్డ’  కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 150 నుంచి 200 మంది బీఆర్ఎస్ ప్రతినిధులతో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కాళేశ్వరం వెళ్తామన్నారు. తెలంగాణ భవన్ నుంచి బస్సుల్లో కాళేశ్వరం వెళ్లి.. దశలవారీగా అన్ని చోట్లకు వెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ సమగ్ర స్వరూపాన్ని తెలంగాణ ప్రజలతో పాటు ఆరోపణలు చేస్తున్న అధికార కాంగ్రెస్ నేతలకు చూపిస్తామని స్పష్టం చేశారు. దశల వారీగా ప్రాజెక్టును సందర్శించి.. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామన్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదు మూడు బరాజ్‌లు. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు.

కాళేశ్వరం అంటే 141 టీఎంసీల స్టోరేజ్‌ కెపాసిటీ..240 టీఎంసీల వినియోగం. వీటన్నింటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు’ అని తెలిపారు.‘రూ.లక్షకోట్ల విలువైన ప్రాజెక్టు అని ఒక వైపు చెబుతూ.. రూ.లక్షకోట్లు కొట్టుకుపోయిందని ఓవైపు చిల్లర మాటలు మాట్లాడుతూ.. రూ.3వేలకోట్ల బరాజ్‌ను అందులో 84 పిల్లర్లు ఉంటే.. మూడు పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజ్‌ కొట్టుకుపోయిందన్నంట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కాదు. అన్నింటింకి మించి 40లక్షలకుపై చీలుకు ఎకరాలకు నీర్చి కామధేనువు కాళేశ్వరం. 88మీటర్ల ఎత్తు నుంచి సముద్రమట్టం మీద 618 మీటర్ల ఎత్తుకు గోదావరి గంగను పైకి ఏటికి ఎదురీదుతూపైకి తీసుకొని పోయే బృహత్తర కార్యక్రమం కాళేశ్వరం. తెలంగాణ టోఫోగ్రఫీకి తెలిసిన వారికి తెలుస్తుంది. తెలంగాణ దాదాపు ఒక గుడిసెలా ఉంటుంది. మధ్య హయ్యర్‌ ప్లాటో ఉంటే ఒక వైపు కృష్ణ, ఒక వైపు గోదావరి ప్రవహిస్తుంటుంది.

పైన 535 మీటర్లపైన హైదరాబాద్‌లాంటి పట్టణం ఉంది. కొండపోచమ్మసాగర్‌ ప్రాంతం 618 మీటర్లు ఎత్తు ఉంది. లక్ష్మీదేవిపల్లి, షాద్‌నగర్‌ ఏరియాలో658 మీటర్లు. ఏటవాలుగా ఉండే పరిస్థితి తెలంగాణది’ అన్నారు.తెలంగాణ టోఫోగ్రపీ, దాని పరిస్థితి తెలిసిన వారు ఎవరైనా తెలుసుకునేది ఏంటంటే.. దిగువన పారుతున్న గోదావరిని ఎగువకు రప్పించేందుకు చేసిన భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం. తెలంగాణ రాష్ట్రానికి, రైతాంగానికి కామధేనువు కాళేశ్వరం. తెలంగాణను కరువు నుంచి గట్టెక్కించే కామధేనువు కాళేశ్వరం. తాగు, సాగునీటి ఇబ్బందులు లేకుండా చేసే కామధేనువు. ఈ ప్రాజెక్టు కాకుండా చేయాలని ఎన్నో కేసులు వేశారు. కేసీఆర్‌కు మస్త్‌ పేరొస్తది.. తెలంగాణ దశాబ్దాలు పడ్డ కష్టం తీరిస్తే కేసీఆర్‌ ప్రజల గుండెల్లో మిగిలిపోతడదని.. ఎన్నో కేసులు వేసిన తర్వాత వాటిని అధిగమించి 400పైగా అనుమతులు సాధించి.. గోదావరి గంగను మన పొలాల్లో ఒప్పొంగేలా చేసింది ఆ నాడు కేసీఆర్‌ నాయకత్వం.నాటి ప్రభుత్వం మీకు నీళ్లు రావు.. దశాబ్దాల పాటు జరిగిన మోసం ఏది ఉందో.. దానికి ముగింపు పలికి గోదావరిలో మన వాటా మనం తీసుకునే స్థాయికి.. కాళేశ్వరం ప్రాజెక్టుతో మన హక్కులను కాపాడుకున్నాం.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ ఉద్యమం దెబ్బకు జడిసి జలయజ్ఞంలో ఆదరాబాదరగా పెట్టారు. ప్రాణహిత, తుమ్మిడిహట్టి నుంచి హైదరాబాద్‌ పక్కనే ఉండే చేవెళ్లకు నీళ్లు తెస్తమని నమ్మబలికి ఆ నాడు ప్రాజెక్టు డిజైన్‌ చేశారు. ఎక్కడి చేవెళ్ల, ఎక్కడి తుమ్మడిహట్టి.. అక్కడి నుంచి ఇక్కడికి నీళ్లు తీసుకువచ్చే ప్రాజెక్టులో ఆ నాడు. స్టోరేజ్‌ అనే కాన్సెప్ట్‌ లేదు’ అని విమర్శించారు.