ప్రజా గాయకుడు గద్దర్ మృతి పట్ల తెలంగాణ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సంతాపం ప్రకటించారు. సోమవారం దమ్మాయిగూడ పురపాలక సంఘం పరిధిలోని 4వ వార్డు స్థానిక కౌన్సిలర్ మంగళపురి వెంకటేష్ ఆద్వర్యంలో మంత్రి మల్లారెడ్డి గద్దర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇ సందర్బంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతు ప్రజా గాయకుడు గద్దర్ మృతి తెలంగాణ ప్రజలకు తీరని లోటని అన్నారు. అనంతరం కౌన్సిలర్ మంగళపురి వెంకటేష్ మాట్లాడుతూ గద్దర్ పాటతో ప్రజల మనసులలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు.
అలాగే ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప మానవతావాది గద్దర్ అని అన్నారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విట్టల్ రావు అని పేర్కొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించారని, గద్దర్ మృతి ఎంతగానో కలచి వేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కమిషనర్ రాజమల్లయ్య, బీఆర్ఎస్ పట్టణ అద్యక్షుడు తిరుపతిరెడ్డి, పట్టణ యువజన అద్యక్షులు కౌకుంట్ల మల్లారెడ్డి, 4వ వార్డు అద్యక్షుడు ఎస్ కే బాకర్, 4వ వార్డు ప్రధాన కార్యదర్శి దానలకోట శ్రవణ్ కుమార్ వర్మ, పట్టణ ఉపాధ్యాయులు మంగళపురి కిరణ్ తో పాటు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు నివాళులర్పించారు