తెలంగాణ ముఖ్యాంశాలు

తెలంగాణ‌లో కొత్త‌గా 1,028 క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ర్టంలోక‌రోనా పాజిటివ్ కేసుల తీవ్ర‌త త‌గ్గుముఖం ప‌ట్టింది. రాష్ర్టంలో కొత్త‌గా 1,028 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 9 మంది మ‌ర‌ణించారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,489 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ర్టంలో ప్ర‌స్తుతం 15,054 క‌రోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇవాళ ఒక్క‌రోజే 1,18,427 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 6.19 ల‌క్ష‌ల మందికి క‌రోనా నిర్ధార‌ణ కాగా, 6.01 ల‌క్ష‌ల మంది ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు.