జాతీయం ముఖ్యాంశాలు

ఐసీఎంఆర్ రికార్డు.. 40 కోట్ల మందికి కోవిడ్ ప‌రీక్ష‌లు

ఐసీఎంఆర్ కొత్త మైలురాయిని అందుకున్న‌ది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు కోవిడ్ ప‌రీక్ష చేయించుకున్న‌వారి సంఖ్య 40 కోట్లు దాటింది. జూన్ 25వ తేదీన ఆ టెస్టింగ్ రికార్డు అందుకున్న‌ట్లు ఐసీఎంఆర్ వెల్ల‌డించింది. జూన్ నెల‌లో స‌గ‌టును 18 ల‌క్ష‌ల మందికి కోవిడ్ టెస్టింగ్ చేసిన‌ట్లు ఐసీఎంఆర్ చెప్పింది. మొత్తం కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన వారి సంఖ్య 40,18,11,892గా ఉంది. ఇక దేశంలో కోవిడ్ టీకా తీసుకున్న వారి సంఖ్య 31.50 కోట్ల‌కు చేరుకున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో 61.19 ల‌క్ష‌ల టీకా డోసులను ఇచ్చారు. గ‌త 24 గంట‌ల్లో దేశంలో 48,698 మందికి కొత్త‌గా వైర‌స్ సంక్ర‌మించింది. 64,818 మంది గ‌త 24 గంట‌ల్లో వైర‌స్ నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో రిక‌వ‌రీ రేటు 96.72గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 5 శాతం లోపుకు త‌గ్గింది. ప్ర‌స్తుతం ఆ రేటు కేవ‌లం 2.97 శాతంగా ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.