pawan
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పవన్ కల్యాణ్ కు విశాఖ పోలీసుల నోటీసులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్కు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా గురువారం జరిగిన సభలో పవన్ కల్యాణ్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు దాఖలు చేశారు.  ఈ మేరకు విశాఖ తూర్పు ఏసీపీ, పవన్ కల్యాణ్ కు నోటీసులు అందించారు.   బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని.. పవన్ ఇలా వ్యవహరించి ఉండకూడదని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
రుషికొండ పర్యటనపై ఆంక్షలు..
విశాఖలోని రుషికొండలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు.  నగరంలోని జోడుగుళ్లపాలెం నుంచి ఎవరినీ అనుమతింబోమని పోలీసులు తేల్చి చెప్పారు. ర్యాడిసన్ బ్లూ హోటల్ నుంచి కేవలం పవన్ వాహనానికి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. రుషికొండ ఎదురుగా ఉన్న రోడ్డులో మాత్రమే పవన్ వెళ్లనున్నారు.