ఇంటింటికి ఓటరు సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేసారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, వివిద రాజకీయ పార్టీల నాయకులతో ఓటరు నమోదు ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. మరణ దృవీకరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరణ దృవీకరణ పత్రాలు ఆధారంగా మృతి చెందిన ఓటర్లను తొలగించాలని ఆదేశించారు. పివిటిజి ఓటరు నమోదుపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 35 శాతం సర్వే పూర్తి చేసారని, మిగిలిన సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. బి ఎల్ ఓలు వాలంటీర్లు లేకుండా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. డూప్లికేట్ ఓటర్లను ఓటరు జాబితా నుండి తొలగించాలని చెప్పారు. వచ్చే అక్టోబరు నెలలో మండల స్థాయిలో ఓటరు నమోదు ప్రక్రియపై సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాకు 3100 వివి ప్యాడ్స్ చేరుకున్నాయని చెప్పారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు వస్తాయని అన్నారు.
ఈ సమావేశం లో పాడేరు శాసన సభ్యులు కొట్టగుళ్లి భాగ్య లక్ష్మి, శతక బుల్లిబాబు డి. ఆర్. ఓ, పి. అంబేద్కర్, వివిద రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.