acb
ఆంధ్రప్రదేశ్ జాతీయం

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇవ్వనిదే ఏ పనీ కావడం లేదు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు ప్లా నింగ్‌ అనుమతి కోసం వెళ్లిన ఓ వ్యక్తిని పంచాయ తీ కార్యదర్శి లంచం డిమాం డ్‌ చేశాడు. నెల రోజులు గా ప్రాధేయప డినా ఆయన కనికరించకపోవడంతో చివరకు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించా డు. వారు విసిరిన వలకు పంచాయతీ కార్యదర్శి అడ్డంగా దొరికిపోయాడు.

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం యల్లయపాలెం గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేగింది. యల్ల యపా లెంకు చెందిన ఎం రవిశంకర్‌ ఓ ఇంటి ని నిర్మిం చుకునేందుకు ప్లానింగ్‌, ఎన్‌ఓ సీ కోసం పంచాయతీ కార్యదర్శి దుయ్య జానకి రామయ్య వద్దకు వెళ్లా డు.నిబంధనల ప్రకారం ఇంటి నిర్మా ణం కోసం ప్లానింగ్‌ పత్రాలు సక్రమంగా ఉన్నా పంచాయతీ కార్యదర్శి 20వేలు డిమాండ్‌ చేశారు. అంతేగాక ఓ కంప్యూటర్‌ ప్రింటర్‌ ఇవ్వాల్సిందేనని పట్టుబడ్డాడు. అనుమతి పత్రాల కోసం నెల రోజులుగా తిరుగుతున్నా పట్టిం చుకోకపోవడంతో చేసేది లేక బాధితుడు రవిశంకర్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా వ్యూహం రచించి అమలు పరిచారు. రవిశంకర్‌ను పంచాయతీ కార్యాల యంలో ఉన్న కార్యదర్శి దుయ్య జానకి రామయ్య వద్దకు పంపారు. రవిశంకర్‌ నుంచి 20వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు జానకి రామ య్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు.