ఆంధ్రప్రదేశ్

300 మామిడి మొక్కల నరికివేతఆవేదన  చెందుతున్న రైతు పోకల మల్లీశ్వరి రెడ్డికేసు నమోదు చేసిన పోలీసులు

బద్వేలు: బద్వేల్ కు సమీపంలోని దొడ్ల పాల డైరీ వద్దా ఉన్న భూమిలో 300 మామిడి మొక్కలను దుండగులు నరికి వేశారు దీంతో రైతు పోకల మల్లీశ్వరి రెడ్డి ఆవేదన చెందుతున్నారు మల్లీశ్వరి రెడ్డి ఫిర్యాదు మేరకు బ్రహ్మంగారిమఠం పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు మామిడి మొక్కలు నరికి వేసిన  ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా బాధిత రైతు మల్లీశ్వరి రెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా హద్దులు ఏర్పాటు చేసుకొని మూడు నెలల క్రితం మామిడి మొక్కలు నాటినట్లు తెలిపారు అనకర్ల జశ్విత మౌనిక సురేష్ నాగిపోగు సురేష్ బింగి ఓబులేష్ తదితరులు వచ్చి కాపల దారుని బెదిరించి మొక్కలు నరికి వేసినట్లు రైతు మల్లీశ్వరి రెడ్డి తెలిపారు అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు