హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సోమవారం కాంగ్రెస్ పార్టీ లోకి చేరికల సమావేశంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ పోలీసులకు తీవ్ర హెచ్చరికలు చేస్తూ,100 రోజుల్లో ప్రభుత్వం మారుతుందని, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సహకరిస్తున్న పోలీసుల పేర్లు రెడ్ డైరీలో నమోదు చేస్తున్నామని, సహకరించిన పోలీసుల గుడ్డలు విప్పదిస్తామని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని జగిత్యాల జిల్లా పోలీస్ అధికారుల సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని
జగిత్యాల జిల్లా పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధి ఏ ఎస్సై శ్రీనివాస్ ఆన్నారు.
ప్రభుత్వాలు ఏవైనా,తెలంగాణ రాష్ట్ర పోలీసులు చట్టానికి లోబడి, చట్ట ప్రకారం పని చేస్తామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ప్రజాశాంతికి భంగం కలిగించే మూకలు ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటామని, చట్ట ప్రకారం పని చేస్తున్న పోలీసులను కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ, పోలీసుల మనోభావాలు దెబ్బ తీసిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను జిల్లా పోలీస్ అధికారుల సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా పోలీస్ అధికారుల సంఘం
జగిత్యాల ప్రతినిధి
ఏఎస్సై శ్రీనివాస్ తెలిపారు.