పత్తికొండ మండలంలో పత్తికొండ నుండి ఆదోని వెళ్లే రహదారి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. పలుచోట్ల ప్రధాన రహదారులు గుంటలమయంగా మారి ప్రజలకు ప్రాణాపాయస్థితికి చేరుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదనేది వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ కాలయాపన అధికారుల నిర్లక్ష్యం వల్ల పత్తికొండ నుండి ఆదోని కు వాహనాల రాక పోకలు ఇబ్బందికరంగా రాకపోకలు సాగిస్తున్నారు ఇది పత్తికొండ పట్టణం శ్రీరామ హాస్పిటల్ దగ్గర్లో నిర్మాణం పక్కన బ్రిడ్జి రంధ్రం పడి కడ్డీలు తేలాయి దీంతో రోడ్డు కాంట్రాక్టర్లు నాణ్యతలేని రోడ్లు వేయకపోవడంతో ఆ మార్గము గుండా వెళుతున్న వాహనాలు రోడ్డు పక్కనుండి వెళ్తే మట్టిలో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్నారు.