ఆంధ్రప్రదేశ్

ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లు మూసివేత

అమరావతి: ప్రకాశం బ్యారేజ్ లోని అన్ని గేట్లను మూసివేసారు. కృష్ణానది దిగువన బుధవారం వరద ప్రవాహం బాగా తగ్గింది. గురువారం  ఉదయం 9:30కు బ్యారేజ్ గేట్లను అధికారులు మూసివేశారు.  ఉదయం 9 గంటలకు 65 గేట్లు మూసి ఉండగా, మిగతా ఐదు గేట్లను ఒక అడుగు మేర ఎత్తారు.  స్వల్పంగా వచ్చే వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.  అరగంట వ్యవధిలోనే వరద ప్రవాహం మరింత తగ్గింది.  దీంతో బ్యారేజ్ మొత్తం అన్ని గేట్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు.