భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ తదితరులు వాజ్‌పేయికి నివాళులు అర్పించారు.
దేశరాజధాని ఢిల్లీలోని సదైవ్ అటల్ మెమోరియల్ పార్క్‌లో దివంగత నేత సమాధి వద్ద ప్రధాని, రాష్ట్రపతి పుష్పాంజలి ఘటించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,
వాజ్‌పేయి పెంపుడు కుమార్తె నమితా కౌట్ భట్టాచార్య, బండి సంజయ్ వాజ్‌పేయి సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఎన్డీయే నేతలు కూడా అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులర్పించారు.అటల్ బిహారీ
వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ బుధవారం ట్వీట్ చేశారు. వాజ్‌పెయి నాయకత్వంలో భారతదేశం చాలా వృద్ధి
చెందిందన్నారు.
దేశాభివృద్ధికి ఆయన గణనీయంగా కృషి చేశారని పేర్కొన్నారు. 21వ శతాబ్దపు భారతదేశానికి పునాది వేయడంలో కీలక పాత్ర పోషించారని కీర్తించారు ప్రధాని నరేంద్ర మోదీ.అటల్ బిహారీ
వాజ్‌పేయి 5వ వర్ధంతి సందర్భంగా అటల్ సమాధి వద్దకు బీజేపీ నేతలు మాత్రమే కాకుండా ఎన్డీయే కూటమి నేతలు కూడా వచ్చారు. అనుప్రియా పటేల్, ప్రఫుల్ పటేల్, తంబిదురై, జితన్ రామ్ మాంఝీ,
సుదేష్ మహతో, అగాథ సంగమ సహా ఇతర నేతలు వాజ్‌పేయి ఘాట్ వద్దకు చేరుకుని నివాళురల్పించారు. అయితే, 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి వేదికపైనా ఎన్డీయే కూటమి ఐక్యత
ప్రదర్శిస్తోంది.మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 93 ఏళ్ల వయసులో 16 ఆగస్టు 2018న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. చాలా కాలం పాటు అనారోగ్యంతో బెడ్‌కే పరిమితం అయిన
ఆయన.. ప్రాణాలు విడిచారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి 1998 నుండి 2004 వరకు మూడుసార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రిగా తన పదవీకాలాన్ని పూర్తి చేశారు. అటల్
బిహారీ వాజ్‌పేయి బిజెపి అగ్ర నాయకులలో ఒకరిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 2 సార్లు రాజ్యసభ ఎంపీగా, తొమ్మిసార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన వాజ్‌పేయి.. మూడు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు
చేపట్టారు. మొట్టమొదట అటల్ బిహారీ వాజ్‌పేయి 1996లో 13 రోజులు, 1998లో 13 నెలలు, ఆ తర్వాత 1999లో 5 సంవత్సరాలు దేశ ప్రధానిగా ఉన్నారు.