స్వచ్ఛభారత్ పేరుతో హంగామా చేయడమే గాని శుభ్రత విషయంలో అధికారులకు ఏ పట్టింపు లేదని తేలిపోయింది. బ్రాహ్మణ కొట్కూర్ మేజర్ గ్రామపంచాయతీకి తరలించేందుకు వాహనాలు ఉన్నా,పారిశుద్ధకార్మికులు ఉన్న, వారికి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం వల్ల వారి విధులకు రావడం లేదు.దీనివలన గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తంతా పడేస్తున్నారు. ఆ చెత్త నుంచి వచ్చే దుర్గందాన్ని భరించలేకపోతున్నారు. వర్షాలకు ఆ చెత్తంతా కుళ్లిపోయి మరింత దుర్బంధం వస్తుంది. విష పురుగులు సంచరించే అవకాశాలు ఉన్నాయి. గ్రామంలో గత ప్రభుత్వం డబ్బు యాడను ఏర్పాటు చేశారు. అక్కడ ఆ పొడిచెత్త, తడి చెత్త,రీసైక్లింగ్ చేస్తారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించకుండా చెత్తను కాల్చి బూడిది చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే గ్రామం రోగాల బారి నుండి సుభిక్షితంగా ఉంటుందని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.