ap-election
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఏప్రిల్ లో ఏపీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఎపుడు అన్న పెద్ద డౌట్ ఉంది. ముందస్తు వెనకస్తు అంటూ చాలా ప్రచారం జరిగింది. విపక్షాలు రేపో మాపో ఎన్నికలు అంటూంటే అధికార వైసీపీ మాత్రం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని అంటూ వచ్చింది. ఇపుడు వైసీపీ మాటే నిజం కాబోతోంది. సార్వత్రిక ఎన్నికల తోపాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కలిపి ఒకేసారి ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. దాంతో ఏపీలో ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ మార్చిలో వస్తాయని, ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయని తెలుస్తుంది. ఈసారి ఏడెనిమిది దశలలో లోక్ సభ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం.మరి ఈసారి లోక్‌ సభ ఎన్నికల పోలింగ్ ఎన్నో ఊహగానాలు వెలువడుతున్నాయి. సౌత్ నుంచి తొలిదశ మొదలెడతారా లేక నార్త్ నుంచి వస్తూ మధ్య దశలలో ఏపీ ఉంచుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అంతకు ముందు ఎన్నికలు చూసుకున్నా మొదటి రెండు దశలలోనే ఏపీలో ఎన్నికలు జరిగాయి. కాబట్టి ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగిస్తారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌‌లో ఏప్రిల్ నెలలో మొదటి రెండు దశలలో ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తుంది.

కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఈ విధంగా స్పష్టమైన సంకేతాలు ఉండబట్టే, ఏపీ ప్రభుత్వం కూడా అందుకు సన్నద్ధతను వ్యక్తం చేస్తూ, ఎన్నికల ముందు జరగాల్సిన ఇంటర్ టెంత్ పరీక్షలు ముందుకు జరిపించి మొత్తం పరీక్షల ప్రక్రియను మార్చి నెలాఖరుతో పూర్తి చేస్తోంది. ఇదే విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మీడియాకు చెప్పారు.సాధారణంగా ఏప్రిల్‌లో జరిగే పరీక్షలు.. ఈసారి నెల ముందుగానే జరగనున్నాయి. సాధారణ ఎన్నికల కారణంగా ముందుగానే నిర్వహిస్తున్నామన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు.. మార్చి 18 నుంచి 30 వరకూ పదో తరగతి పరీక్షలు జరుగుతాయన్నారు. నిజానికి ఏప్రిల్ లో పదవ తరగతి పరీక్షలు జరుగుతాయి. కానీ ఈసారి వాటిని ముందుకు జరిపారు. ఇక తొమ్మిది దాకా పరీక్షలను కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో నిర్వహించి ఎన్నికల ప్రక్రియకు మొత్తం సిద్ధం చేస్తారు అని అంటున్నారు.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎక్కువగా పోలింగ్ స్టేషన్లుగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలే వాడుకుంటారు. కాబట్టి ఈ ముందస్తు ఏర్పాట్లు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.