dammaiguda
తెలంగాణ

మున్సిపల్ కార్మికులకు పని వేళలు మార్చాలి

దమ్మాయిగూడ మున్సిపల్ కార్మికులకు 8 గంటల పని రెండు బాగాలు చేసి రవాణా ఖర్చులతో బారాలు మోపుతున్నారని సిఐటియు యూనియన్ ఆధ్వర్యం లో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన కార్మికులు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉదయం విధులకు రావాలి, మల్ల వెళ్లి పోవాలి, మల్లి రావాలి, మల్లి వెళ్లిపోవాలి, దీనితో కార్మికులకు రవాణా ఖర్చులు ఎక్కువైతున్నాయని అన్నారు. ఇప్పటికీ చాలా సార్లు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చాల సార్లు కమీషనర్ దగ్గరికి తీసుకెళ్ళినా కమీషనర్ పట్టించుకోవడం లేదు. దీన్ని నిరసిస్తూ గురువారం కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం కమీషనర్ వచ్చి మాట్లాడి సమస్య ౩౦ తారీకు లోపల పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. దమ్మాయిగూడ మున్సిపల్ కమీషనర్ ఈ సమస్య పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.