- రెండ్రోజులు అతి భారీ వర్షాలు
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- రెండ్రోజులు అతి భారీ వర్షాలు
వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర ఆంధ్ర-దక్షిణ ఒడిశా తీరం దగ్గర అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్న తెలిపారు. ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని పేర్కొన్నారు. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు తెలిపారు. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురువొచ్చని చెప్పారు.