congress
తెలంగాణ రాజకీయం

కాంగ్రెస్ అభ్యర్దుల దరాఖాస్తుల విక్రయం షురూ

ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే కాంగ్రెస్ అభ్యర్థుల కోసం అప్లికేషన్స్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, మధుయాష్కీ,  అంజన్ కుమార్ యాదవ్, ఇతర నేతలు శుక్రవారం గాంధీ భవన్ లో ప్రారంభించారు. తరువాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్టీ అభ్యర్థులకు రూ.25వేలు, సాధారణ అభ్యర్థులకు రూ.50వేలుగా దరఖాస్తు రుసుము నిర్ణయించారు. దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడదు. ఈరోజు నుంచి దరఖాస్తుల కార్యక్రమం మొదలైందని అన్నారు. ఈ నెల 25 వరకు దరఖాస్తులు తీసుకుంటారు. ఎలక్షన్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుంది. పార్టీకి వారు చేసిన సేవలు, సర్వేలు, గెలుపు ప్రాతిపదికన అభ్యర్థుల నివేదిక తయారు చేస్తారు.

సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్దారించాకే అభ్యర్థులను ఫైనల్ చేస్తారు. అప్పటివరకు తామే అభ్యర్థులమంటూ ఎవరైనా చర్చించుకున్నా.. అవి ఊహాగానాలే అవుతాయని అన్నారు. అభ్యర్థులు ఫైనల్ అయినట్లు మీడియాలో వచ్చే కథనాలు నమ్మొద్దు. గతంలో హామీ ఇచ్చారని జరిగే ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే   పార్టీ నేతలెవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని అన్నారు.