ఉప్పల్లో మాత్రం అభ్యర్థి మార్పు
అధికార భారత రాష్ట్ర సమితి రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నలుగురు సిట్టింగ్ లకు మరో సారి అవకాశం ఇవ్వగా… ఉప్పల్ అసెంబ్లీ కి మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి సోదరుడు లక్ష్మారెడ్డికి అవకాశం ఇచ్చారు.
ఉహించినట్లే మేడ్చల్ అసెంబ్లీ నుంచి మంత్రి చామకూర మల్లారెడ్డి, కుతుబుల్లాపూర్ నుంచి ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ జిల్లా బ్రస్ పార్టీ అద్యక్షుడు శంబీపూర్ రాజు ఆశించారు కాని ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గౌడ్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది.
మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హనుమంత రావు, కూకట్‌పల్లి నుంచి మాధవరం కృష్ణారావు, ఉప్పల్ అసెంబ్లీలో మత్రం ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, టిక్కెట్‌కు తీవ్ర ప్రయత్నాలు చేసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌లను ప్రక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే (B.L.R) లకు అవకాశం ఇచ్చారు