satya-movie
తెలంగాణ

మహిళల గొప్పతనాన్ని చాటే సత్య లో అందర్నీ ఆకట్టుకుంటున్న సాయి ధరమ్ తేజ్

సమాజం పట్ల బాధ్యత ఉన్న హీరోల్లో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఉంటారు. ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. తన సంపాదనలో కొంత ఛారిటీ కూడా చేస్తుంటారు. విజయవాడలోని వృద్ధాశ్రమం తో పాటు తెలంగాణలోని ఓ ఊళ్లో 100 మందికి పైగా ఉన్న స్కూల్ లోని పిల్లల బాధ్యత కూడా తీసుకున్నారు.
అలాగే తేజ్ కు మహిళల పట్ల అమితమైన గౌరవం ఉంటుంది. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల విరూపాక్ష,  బ్రో వంటి వరుస విజయాలు అందుకున్నారు తేజ్. తాజాగా మహిళల గొప్పతనాన్ని చాటే ఓ షార్ట్ ఫిలింలో నటించారు. ఏ ఫంక్షన్ లో అయినా మహిళల గురించి వారి భద్రత గురించి చాలా గొప్పగా చెప్పే సాయి ధరమ్ తేజ్ కి ఆడవారంటే చాలా గౌరవం. అందుకే ఆడవారు లేకుంటే ప్రపంచం లో ఎవరికి మనుగడ వుండదు అనే దాన్న బలంగా ఈ చిత్రంతో తీసుకువెళ్ళాలనే ఉద్దేశ్యం తో షెడ్యూల్ ఎంత బిజిగా వున్నా కూడా సత్య అనే సినిమాలో నటించారు. సీనియర్ నటుడు నరేష్ గారి కుమారుడు హీరో నవీన్ విజయ్ కృష్ణ ఈ షార్ట్ ఫిలిం కి దర్శకత్వం వహించారు. కలర్స్ స్వాతి ఫిమేల్ లీడ్ గా సాయి ధరమ్ తేజ్ కి జంటగా నటించింది. దిల్ రాజు ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్, హ‌న్షిత దీన్ని నిర్మించారు.  రీసెంట్ గా ఈ షార్ట్ ఫీచర్ నుంచి సోల్ ఆఫ్ స‌త్య అనే మ్యూజిక‌ల్ షార్ట్‌ను  రామ్ చ‌ర‌ణ్ విడుద‌ల చేసి టీమ్ ను అభినందించార
మ‌న కోసం దేశ స‌రిహ‌ద్దుల్లో ప్రాణాల‌ను అర్పిస్తున్న సైనికుల‌కు, వారి వెనుకున్న ఎందరో త‌ల్లులు, భార్యలు, అక్కలు, చెల్లెళ్లకు నివాళి గా.. మంచి కాన్సెప్ట్ తో ఈ  షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారు. ఇందులో సోల్జర్ గా సాయిధరమ్ తేజ్ కనిపిస్తారు. ఆయన భార్యగా కలర్స్ స్వాతి నటించింది. భార్య భర్తల మధ్య ఉండే ప్రేమానుబంధాన్ని ఈ వీడియోలో చక్కగా చూపించారు. ఓవైపు భార్యను ప్రేమిస్తూనే మరోవైపు దేశాన్ని కూడా ప్రేమిస్తూ దేశం కోసం ప్రాణాలర్పించే సోల్జర్ పాత్రలో సాయిధరమ్ తేజ్ నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. దేశాన్ని ప్రేమిస్తూ దేశం కోసం పోరాడే గొప్ప యోధులను కని, పెంచడమే కాకుండా.. దేశం కోసం తమ ప్రేమను త్యాగం చేసిన గొప్ప మహిళలందరికీ ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ సాంగ్ ను అంకితం ఇచ్చారు. సింగర్ శృతి రంజని ఈ పాటను కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా లిరిక్స్ రాసి పాట పాడారు.