తెలంగాణ

Basara IIIT : ట్రిపుల్‌ ఐటీ రెండో జాబితా విడుదల

నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీలో 2021-22 విద్యాసంవత్సరానికిగాను మొదటి దశ కౌన్సెలింగ్‌లో 172 మంది విద్యార్థులు గైర్హాజరైయ్యారు. వారి స్థానంలో మెరిట్‌ ఆధారంగా 172 సీట్లను భర్తీ చేస్తూ అధికారులు రెండో జాబితాను విడుదల చేశారు. వీరికి ఈ నెల 17న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.

వీరితో పాటుగా పీహెచ్‌, క్యాప్‌, ఎన్‌సీసీ కేటగిరీ వారికి కూడా అదేరోజున కౌన్సెలింగ్‌ ఉంటుంది. గ్లోబల్‌ కేటగిరీలో ఎంపికైన విద్యార్థులకు 18న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. జాబితాను www.admissions.rgukt.ac.in లో పొందుపరిచినట్లు తెలిపారు.