నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ కూలిన ఘటనలో 17 మంది మృతిచెందారు. మిజోరం రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద మరో 30 మంది ఉంటారని భావిస్తున్నారు. సాయిరంగ్ వద్ద ఉన్న కురంగ్ నదిపై బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు.
మిజోరం(Mizoram) రాష్ట్రంలోని సాయిరంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ కూలింది. ఈ ఘటనలో సుమారు 17 మంది మరణించినట్లు తెలుస్తోంది. కురుంగ్ నదిపై ఆ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. అనేక మంది ఆ బ్రిడ్జ్ శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
సాయిరంగ్ నుంచి బైరాబి మధ్య ఆ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో దాదాపు 40 మంది వర్కర్లు ఉండి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇనుప బ్రిడ్జ్ కింద చిక్కుకున్న 17 మంది కార్మికులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది వర్కర్లు శిథిలాల కింద ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.