nara-saireddy
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పర్మిషన్ ఇస్తాం.. చక్కగా సులభ్ కాంప్లెక్స్ పెట్టుకోవచ్చుగా : నారా లోకేష్‌పై సాయిరెడ్డి సెటైర్లు

కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించిన బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేసిన విమర్శలకు అధికార వైఎస్ఆర్సీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు ఆయనపై ఘాటు విమర్శలు చేశారు. తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయిరెడ్డి స్పందించారు. నారా లోకేష్‌పై సెటైర్లతో చెలరేగారు

గన్నవరం సభలో నారా లోకేష్ వైఎస్ఆర్సీపీ నేతలపై ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి, గుడివాడ వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు కొడాలి నాని, గన్నవరం టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను టార్గెట్‌గా చేసుకున్నారు. వారిద్దరినీ ఉద్దేశించి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. సెటైర్లు సంధించారు. గెలిస్తే తంతాం, గెలిస్తే బట్టలిప్పుతాం, గెలిస్తే ఉచ్చపోయిస్తాం.. అంటూ ప్రతి సభలో చెబుతూ, ఎర్రబుక్కులో రాసుకుంటూ తిరుగుతున్న నారా లోకేష్‌ను చూస్తోంటే- ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు.

ఎక్కడికి పోయినా అబ్బా, కొడుకులు ఒకే డైలాగ్‌ను చెప్పుకుంటోన్నారని సాయిరెడ్డి సెటైర్లు వేశారు. టీడీపీ పేరును జీపీటీగా మార్చుకోవాలని సూచించారు. జీపీటీ అంటే దానికి అర్థాన్ని వివరించారు సాయిరెడ్డి. గెలిస్తే తంతాం.. అని మార్చుకోవాలంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ గెలిస్తే కదా? అవన్నీ జరిగేది.. అంటూ చురకలు అంటించారు.

అంతగా ఉచ్చపోయించాలని ఉవ్విళ్లూరుతుంటే.. ప్రభుత్వం అనుమతి తీసుకుని నారా లోకేష్ ఓ సులభ్ కాంప్లెక్స్ లేదా, పబ్లిక్ టాయ్‌లెట్ పెట్టుకోవచ్చని సాయిరెడ్డి అన్నారు. హెరిటేజ్‌కు సబ్‌స్టిట్యూట్‌గా ఈ వ్యాపారం పెట్టుకోవచ్చని సూచించారు. ఇది కూడా వారికి అచ్చి రావొచ్చంటూ పేర్కొన్నారు. నారా లోకేష్‌ చేస్తోన్న పాదయాత్రను చూస్తే అతనికి ఏవైనా మాయలు మంత్రాలు తెలుసానని అందరూ అడుగుతున్నారని సాయిరెడ్డి చెప్పారు. విజయవాడలో పాదయాత్ర ముగించుకుని 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఏలూరులో తేలాడట.. అతని వద్ద విఠాలాచార్య సినిమాల్లోలాగా మంత్రదండం ఉందా? అంటూ సందేహాలను వ్యక్తం చేశారు.