కాంగ్రెస్ పార్టీలో తమ వాళ్లు ఉన్నారని స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన టికెట్లలో సగం మందికి బీ ఫామ్ లు రావన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకదానికొకటి సపోర్ట్ చేసుకున్నాయని తెలిపారు. కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులు ఇస్తున్నారు. కాంగ్రెస్ లో గెలిచిన అభ్యర్థులు బీఆర్ఎస్ లో చేరతారని ఆరోపించారు.
ఈ మేరకు ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూరులో బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా 10టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఎక్కడైతే బీఆర్ఎస్ ఓడిపోయే సీటు ఉంటుందో అక్కడ అపొజిట్ వ్యక్తికి కేసీఆర్ డబ్బులు సహాయం చేస్తాడని విమర్శించారు. రామగుండం ఎమ్మల్యేకు డబ్బులు పంపింది సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీలో తమ వాళ్లు ఉన్నారని స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన టికెట్లలో సగం మందికి బీ ఫామ్ లు రావన్నారు. కాంగ్రెస్ పార్టీ దళిత డిక్లరేషన్ తో దళితులకు ఒరిగేది ఏమీ లేదని విమర్శించారు.
అంబేద్కర్ ను అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. మల్లికార్జున ఖర్గే బీజేపీపై చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దళిత కుటుంబాలకు అనేక ప్రోత్సాహలు అందిస్తోందని చెప్పారు. ఈ రోజు ఖమ్మం సభలో బీజేపీలో చేరే నేతల సమాచారం తనకు లేదన్నారు.