shiva shakti
జాతీయం ముఖ్యాంశాలు

శివశక్తి పేరు పెట్టడంలో తప్పు లేదు: ఇస్రో చైర్మన్

విక్రమ్ ల్యాండర్ దిగిన చోటుకు శివశక్తి అనే నామకరణ చేయడాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చైర్మన్ ఎస్.సోమనాథ్ సమర్ధించారు. ఇందులో తప్పేమీ లేదన్నారు. శివశక్తి , తిరంగా అనే రెండు పేర్లు భారతీయతకు చిహ్నమని అన్నారు.

విక్రమ్ ల్యాండర్ దిగిన చోటుకు శివశక్తి (Shivshakti) అనే నామకరణ చేయడాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చైర్మన్ ఎస్.సోమనాథ్ (S.somanath) సమర్ధించారు. ఇందులో తప్పేమీ లేదన్నారు. శివశక్తి , తిరంగా అనే రెండు పేర్లు భారతీయతకు చిహ్నమని అన్నారు. తనకు ఇటు సైన్స్‌, అటు ఆధ్యాత్మికంపై అసక్తి ఉందని చెప్పారు. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని ఆయన ఆదివారంనాడు సందర్శించారు.

విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి ‘శివశక్తి’గా నామకరణం చేయడం దేశ ప్రధానిగా మోదీకి ఉన్న విశేషాధికారమని సోమనాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను బెంగళూరులో మోదీ శనివారంనాడు కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతాన్ని ‘శివశక్తి’గా, 2019లో చంద్రయాన్-2 చంద్రునిపై కూలిన ప్రదేశాన్ని తిరంగా పాయింట్‌గా పిలుచుకుందామని అన్నారు. వందేల ఏళ్ల బానిసత్వం కారణంగా భారత ఉజ్వల శాస్త్రీయ జ్ఞానం మరుగనపడిందని, ఆజాదీ కా అమృత్ కాలంలో ఆ విజ్ఞాన నిధికి మళఅలీ వెలికితీసి ప్రపంచానికి చాటిచెప్పాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు.

కాగా, చంద్రయాన్-3 ల్యాండింగ్ పాయింట్‌కు విక్రమ్ సారాభాయ్ పేరు కానీ, నెహ్రూ పేరు కానీ పెట్టి ఉండవచ్చని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ అన్నారు. ”ఇంతకంటే బీజేపీ ఏం చేస్తుంది?. చంద్రయాన్ త్రివర్ణ పతాకం రెపరెపలాడించిన చోటుకు విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టి ఉండొచ్చు. విక్రమ్ సారాభాయ్, పండిట్ నెహ్రూ చేసిన కృషి ఫలితం వల్లే ఈరోజు ఇది సాధ్యమైంది. నెహ్రూజీ కంట్రిబ్యూషన్ ఉంది. కానీ మీరు శాస్త్రవేత్తలను విస్మరించాయి. ప్రతిచోటా హిందుత్వ తీసుకువస్తున్నారు. మేము కూడా హిందుత్వను నమ్ముతాం. కానీ, సైన్సుకు సంబంధించి వచ్చినప్పుడు, హిందుత్వను తీసుకురావడం సరికాదు, ఈ మాట వీర సావార్కర్ చెప్పినదే” అని రౌత్ అన్నారు.