luna-25
అంతర్జాతీయం ముఖ్యాంశాలు

చంద్రుడిపై కూలిపోయిన రష్యా లునా-25 మిషన్..!

చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్‌ కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ అధికారికంగా వెల్లడించింది. 47 ఏళ్ల తర్వాత జాబిల్లిపై రష్యా లూనాను పంపించింది. లూనా-25లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని వెల్లడించిన కొన్ని గంటలకే కుప్పకూలిపోయినట్లు గుర్తించింది.