jiocinema
జాతీయం ముఖ్యాంశాలు

భారతదేశపు అతిపెద్ద డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా జియో సినిమా..

టెక్నాలజీ వేగంగా మార్పు చెందుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జియో డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ జియో సినిమా ముందుకెళ్తోంది ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) అన్నారు. గత సంవత్సరం మీడియా, వినోద రంగంలో చాలా మార్పులు వచ్చాయని.. ఈ పరిస్థుతుల మధ్య, JioCinema ఒక లీడర్‌గా నిలిచిందని అన్నారు. తమ 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ యొక్క మీడియా, వినోద వ్యాపారాలపై ముఖేష్ అంబానీ మాట్లాడారు.

JioCinema తొలిసారి ఐపీఎల్‌ను ఉచితంగా ప్రసారం చేసి సక్సెస్ అయింది. 45 కోట్ల మంది వీక్షకులు ట్యూన్ చేయడంతో ఈ ప్లాట్‌ఫారమ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. భారతదేశంలో కంటెంట్ వినియోగించే విధానంలో.. టెక్టోనిక్ మార్పును సూచిస్తున్న లీనియర్ టెలివిజన్‌లో కంటే డిజిటల్ పరికరాలలో ఎక్కువ మంది ప్రజలు IPLని చూస్తారు అని ముఖేష్ అన్నారు. 12 కోట్ల మందికి పైగా ప్రజలు IPLను ఆన్‌లైన్‌లో వీక్షించారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించబడిన డిజిటల్ ఈవెంట్‌గా మారిందని ఆయన తెలిపారు.

ఎక్కడి నుండైనా 360 డిగ్రీల వీక్షణ ద్వారా స్టేడియం లాంటి అనుభవంతో భారతదేశంలో క్రీడల వీక్షణలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సంస్థ యొక్క AR VR పరికరం JioDive విజయాన్ని కూడా ఛైర్మన్ స్పృశించారు. JioCinema ఇప్పుడు బ్లాక్‌బస్టర్ సినిమాలు, OTT ఒరిజినల్‌లు, అతిపెద్ద రియాలిటీ షోలకు కేరాఫ్ అడ్రస్ అయిందని చెప్పారు. భారతదేశపు అతిపెద్ద డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ గా మారిందని.. HBO , NBCUniversal వంటి గ్లోబల్ నెట్‌వర్క్‌ల నుండి ప్రత్యేకమైన కంటెంట్‌ కూడా ప్రసారం చేస్తుందని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా వినోదం వేగంగా మారుతోంది, లీనియర్ నుండి ఇంటరాక్టివ్ కంటెంట్‌కి మారుతుంది. వీక్షకులు కంటెంట్‌తో ఎలా నిమగ్నమై ఉన్నారనే దానిపై జియో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చి.. భారతదేశంలో ఈ ట్రెండ్‌ని వేగవంతం చేస్తోంది అని ఆయన అన్నారు. మా సెట్ టాప్ బాక్స్ ప్రముఖ గ్లోబల్, ఇండియన్ స్ట్రీమింగ్ యాప్‌లతో పాటు JioCinema, JioTv Plus వంటి Jio యాప్‌లను సపోర్ట్ చేస్తుందని ముఖేష్ చెప్పారు.

వినియోగ విధానాలలో మార్పు గురించి మాట్లాడుతూ.. “నిజమైన 4k స్ట్రీమ్‌లు, 360 డిగ్రీల స్ట్రీమ్‌లు, మల్టీ కెమెరా వీక్షణలు, అభిమానుల పరస్పర ఇంటరాక్షన్ వంటి ఆవిష్కరణలతో JioCinema ముందుకెళుతోంది అని చెప్పారు. ఈ ప్లాట్‌ఫారమ్ పై మల్టీ వీడియో, పిక్చర్ ఇన్ పిక్చర్ అలాగే భారతీయ భాషలకు బహుభాషా మద్దతు లాంటి మరిన్ని ఫీచర్లను కూడా యాడ్ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.