mallareddy
తెలంగాణ రాజకీయం

రాంకీ డంపింగ్ యార్డ్ వ్యర్ధాలు వచ్చే నాలాను పరిశీలించిన మంత్రి మల్లారెడ్డి

దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కుందన్పల్లి లోని రాంకీ డంపింగ్ యార్డ్ నుండి వ్యర్ధాలు వచ్చు నాలాను కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మంగళవారం సందర్శించారు. సూర్యనారాయణ చెరువు దగ్గర ఉన్న కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని, రాంకీ డంపింగ్ యార్డ్ నుండి వ్యర్ధాలు, మురికి నీరు చెరువులో కలవకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ ప్రశాంత్ కి తూము ఏర్పాటు చేయవలసినదిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, స్థానిక అవార్డు కౌన్సిలర్, వరగంటి వెంకటేష్, నాగయ్య పల్లి సుజాత శ్రీనివాస్, మంగళపురి వెంకటేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆరో వార్డు ఇంచార్జ్ సుర్వి వెంకటేష్, నాయకులు వశుపతి శ్రీకాంత్ గౌడ్, కొత్త భాస్కర్ గౌడ్, తిరుపతి రెడ్డి, కాజా మియా తదితరులు పాల్గొన్నారు.