indo-ame
జాతీయం రాజకీయం

అమెరికా భారత్ మధ్య కీలక ఒప్పందం

దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అతిధుల ఆహ్వాన దగ్గర నుంచి భద్రత, అతిధులకు అతిథ్యం వరకు అన్ని సిద్ధమయ్యాయి. శని, ఆదివారాల్లో జరిగే సదస్సుకు ప్రపంచ నేతలు ఒక్కొక్కరుగా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. సదస్సుకు ముందే అమెరికా భారత్ మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది.జీ20 శిఖరాగ్ర సదస్సుకు ముందే ఈ ఒప్పంద నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని అమెరికా వస్తువులపై విధిస్తున్న అదనపు సుంకాలను ఎత్తివేయాలని భారత్ తీసుకుంది. దాదాపు 6 అమెరికా ఉత్పత్తులపై భారత్ అదనపు సుంకాలను ఎత్తివేసింది. వీటిలో సెనగలు, ఉలవలు, ఆపిల్స్, వాల్ నట్స్, బాదం ఉన్నాయి.  దీనికి బదులుగా పలు ఉత్పత్తులపై భారత్ సైతం అదనపు సుంకాలు విధించింది. వాటిలో కొన్నింటికి తాజాగా మినహాయింపు ఇచ్చింది.

జీ 20 చిత్ర సదస్సుకు అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్  హాజరు కానున్న సందర్భంగా ఆయనతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో భారత్ తాజా నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.ప్రధాని మోదీ ఇటీవల అమెరికా పర్యటకు వెళ్ళిన విషయం తెలిసిందే. అమెరికా పర్యటన సమయంలో దాదాపు 6 అంశాల్లో నెలకొన్న వాణిజ్య వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి.  అందులో తాజాగా అదనపు సుంకాల అంశం కూడా ఉంది. 2023- 24 ఇరుదేశాల మధ్య లేపాక్షిక సరుకు వాణిజ్యం 128.9 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు అమెరికా బాదం, వాల్ నట్స్, శనగలు, ఉలవలు, ఆపిల్స్ తదితరాల పై విధించిన అదనపు సుంకాలను ఎత్తివేయాలని జూలైలో రాజ్యసభలో కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. జీ20 సదస్సు దేశ రాజధాని ఢిల్లీ ఆతిథ్యం ఇస్తుండడంతో…. దేశమంతా జీ20 పేరు మారుమోగుతోంది.

ప్రధాని మోదీ అధ్యక్షతన అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి ప్రపంచ అగ్ర నేతలతో పాటు 40 కి పైగా దేశాల అధినేతలు ఢిల్లీలో రెండు రోజులపాటు భేటీ కానున్నారు.ప్రపంచ వేదికపై అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ వారధిగా నిలవాలన్న లక్ష్యంతో  జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది. ఇందుకు పలు కీలక ఆశయాల సాధనగా  ముందుకు వెళుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రపంచ వేదికపై భారత్ ఛాంపియన్ గా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు జీ20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే సమయంలో ప్రధాని మోదీ ఈ విధంగా వ్యాఖ్యానించారు. సమావేశాలు ప్రారంభానికి ముందే అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రతినిధులతో మోడీ వర్చువల్గా సమావేశం అయ్యారు. ఇందులో భాగంగా వివిధ దేశాలతో పలు కీలక ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతోంది.

ఈ సదస్సులకు కేవలం ఆర్థిక అంశాలే ప్రధానంగా ఏర్పడింది కాబట్టి… తొలుత జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ మాత్రమే ప్రతి సంవత్సరం భేటీకి హాజరయ్యేవారు. కానీ 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం ఈ సదస్సును సభ్య దేశాల దేశాధినేతల స్థాయికి పెంచారు.  ఏటా జి20 సభ్య దేశాల అధినేతలు శిఖరాగ్ర సదస్సు నిర్వహించి చర్చిస్తుండగా… ఆర్థిక మంత్రుల భేటీ లు ప్రతి ఏటా రెండుసార్లు జరుగుతున్నాయి. తలుత ఆర్థిక అంశాలకే పరిమితమైన జీ 20 తర్వాత వాణిజ్యం, ఇంధనం, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం పైన చర్చించడం ఆరంభించింది. ప్రస్తుతం ఢిల్లీ ఈ సదస్సు సిద్ధమవుగా ప్రపంచ దేశాలు ప్రస్తుతం భారత వైపు చూస్తున్నాయి.