బంద్ కారణంగా నంద్యాల జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేసారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కు కోర్టు రిమాండ్ విధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు, నంద్యాల జిల్లాలో సోమవారంరోజు తెల్లవారుజాము నుండి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేపారు. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి , నంద్యాల టౌన్ లో స్వయంగా బందోబస్తు విధులను పర్యవేక్షించారు.
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులపైన, ముఖ్య కూడళ్లలో, బస్టాండ్ లలో, రైల్వే స్టేషన్ లలో, ముఖ్య ప్రభుత్వ కార్యాలయాల వద్ద పికెట్లు, పెట్రోలింగ్ ఏర్పాట్లు చేసి.పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించడం జరిగింది.