pok
జాతీయం

పీవోకే త్వరలో భారత్‌లో కలిసిపోతుంది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)పై కేంద్ర మంత్రి వీకే సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)పై కేంద్ర మంత్రి వీకే సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవోకే త్వరలో భారత్‌లో కలిసిపోతుందని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని దౌసాలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ ప్రాంతాన్ని (పీవోకే) భారత్‌లో విలీనం చేయాలంటూ పీవోకే ప్రజలు చేస్తున్న డిమాండ్లపై మీడియా కేంద్ర మంత్రిని ప్రశ్నించింది. ఇందుకు ఆయన సమాధానిమిస్తూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) తనంతట తానే భారత్‌లో విలీనమవుతుందన్నారు. అయితే అందుకు కొంత సమయం పట్టొచ్చన్నారు. కాగా, భారతదేశంలో కలుస్తామంటూ ఇటీవలే పీవోకే ప్రజలు భారీ ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి వీకే సింగ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.