ఆంధ్రప్రదేశ్ రాజకీయం

చంద్రబాబు నాయుడు అరెస్టు ఫలితం వైసీపీ పతనం గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  అరెస్టు తో సంబరాలు చేసుకుంటున్న వైసీపీ పార్టీ కి పతనం మొదలైంది అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు వారు చంద్రబాబు కు మద్దతు గా మేము సైతం అంటు మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం లో రిలే నిరహౕర దీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి ని అక్రమ అరెస్టు చేయడం ప్రజలు గమనిస్తూ న్నారు అని రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వం కి తగిన బుద్ధి చెపుతారు అని త్వరలో చంద్రబాబు నాయుడు ఆణిముత్యం లాగా బయటికి వస్తారు అని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

ఈ దీక్ష కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని,తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షులు బాపురం సుదీర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ చార్జ్ లు అడివప్ప గౌడ్, వెంకటపతి రాజు, కోట్రేష్ గౌడ్, మైనారిటీ నియోజకవర్గం అధ్యక్షులు టిపుసుల్తాన్,డాక్టర్ సెల్ అధ్యక్షులు రాజానంద్, టి యన్ యస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివమూర్తి,బిసి సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు, కురువ వీరేష్, మౌలసాబ్, హల్వి ఉసేని, కౌతాళం మండలం అన్ని గ్రామాలు నాయకులు కార్యకర్తలు దీక్ష లో కూర్చున్నారు సంఘీభావం గా కోసిగి బిసి సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, జ్ఞానేష్,చావిడి వెంకటేష్,మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి ఉమర్ సాబ్, యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి రాజాబాబు ఐ టిడిపి మంజునాత్ డేని, నీలకంఠ తదితరులు పాల్గొన్నారు.