tet
ఆంధ్రప్రదేశ్

టెట్‌కు సర్వం సిద్ధం -టెట్ జిల్లా అబ్జర్వర్, రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఉషారాణి

ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రధానమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నాగర్ కర్నూలు జిల్లాలో ఈ నెల 15న శుక్రవారం నిర్వహించనున్న టెట్ పరీక్షకు సంబంధించిన 36 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టెట్ జిల్లా అబ్జర్వర్ రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఉషారాణి తెలిపారు.
గురువారం నాగర్ కర్నూల్ డి ఈ ఓ కార్యాలయంలో చీఫ్ సూపరిండెంట్లు, డిపార్ట్మెంట్ల అధికారులకు పరీక్షకు సంబంధించిన మెటీరియల్ పంపిణీ కార్యక్రమాన్ని డీఈఓ గోవిందరాజులుతో కలిసి ఆమె పరిశీలించారు.
సిబ్బంది నియామకం తదితర అంశాలపై సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు.
పరీక్షలు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించాలని చీప్ సూపర్డెంట్లను ఆమె ఆదేశించారు.
ఏ చిన్న పొరపాటు జరిగిన అందుకు చీప్ సూపరిండెంట్ లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ……
ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రధానమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) జిల్లాలో ఈ నెల 15న శుక్రవారం నిర్వహించనున్న టెట్ పరీక్షకు  సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసామని తెలిపారు. టెట్‌ కోసం జిల్లాలో పేపర్‌-1, పేపర్‌-2కు మొత్తం 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 8539 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు ఆమె తెలిపారు.
 గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆమె  సూచించారు.
 పేపర్‌ 1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు,పేపర్‌ 2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నట్లు తెలిపారు.
డి ఓ గోవిందరాజులు మాట్లాడుతూ….
ఉపాధ్యాయ అర్హత పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు. టెట్‌ నిర్వహణకు 24 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. 36డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, 36 చీఫ్‌ సూపరింటెండెంట్‌,  మంది హాల్‌ సూపరింటెండెంట్‌, 6 ఫ్లయింగ్‌ స్కాడ్స్‌ నియమించగా, ఒక్కో పరీక్షా కేంద్రంలో 240 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.
 విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత శాఖకు జిల్లా కలెక్టర్  ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని, కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు.
 అభ్యర్థులు తమ హాల్‌టికెట్లలో పేరు, పరీక్షా కేంద్రాల చిరునామా తదితర పొరపాట్లు ఉంటే హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫొటో, సంతకం తప్పనిసరిగా ఉండాలని, లేనివారు గెజిటెడ్‌ అధికారితో ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని తెలిపారు.
నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో 22 పరీక్ష కేంద్రాల్లో 5280 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు.
బిజినపల్లి మండల కేంద్రంలో 6 పరీక్ష కేంద్రంలో 1440 మంది అభ్యర్థులు అచ్చంపేటలో ఆరు పరీక్ష కేంద్రాల్లో 1440 మంది అభ్యర్థులు కల్వకుర్తి లో 2 పరీక్షా కేంద్రాల్లో 379 మంది అభ్యర్థులు టెట్ పరీక్షలకు హాజరుకానున్నట్లు డిఇఓ తెలిపారు.
ప్రభుత్వ పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ నాగరాజ్, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రవి యాదవ్, శ్రీనివాస చారి సిబ్బంది వెంకట్, సాయి, సునీల్, పవన్, కృష్ణ, చీఫ్ సూపర్డెంట్లు డిపార్ట్మెంటల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.