సీఎం జగన్, ఆయన సతీమణి, సాక్షి ఎండీ భారతీరెడ్డిలకు కోర్టు నుంచి నోటీసులు అందాయి. ప్రభుత్వ పథకాల సమాచారంతో పాటు ఎక్కువ రీచ్ ఉండే పత్రికను కొనాలని గతంలో ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ. 200 చొప్పున మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దొడ్డిదారిన ఈ జీవో ఇచ్చి పరోక్షంగా సాక్షి పేపరు సర్కులేషన్ ను పెంచడంపై ఉషోదయా పబ్లికేషన్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఏపీ హైకోర్టులో కాకుండా ఢిల్లీ హైకోర్టులో విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో భాగంగా నోటీసులను స్థానిక మంగళగిరి కోర్టు ద్వారా ఢిల్లీ హైకోర్టు సెర్వ్ చేయించింది. నేడు నోటీసులు తీసుకుని సీఎం క్యాంపు కార్యాలయానికి కోర్టు సిబ్బంది వచ్చినట్టు తెలుస్తోంది. జగన్ దంపతులకు నోటీసులు అందజేసినట్టు సమచారం.