pawan-jagan
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పోలీసులను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నజగన్ నిజంగా జగన్ యుద్ధమే కోరుకుంటే తాము సిద్ధం జగన్‌ కుదమ్ముంటే ఒక ప్రెస్‌మీట్ పెట్టాలి పవన్ కళ్యాణ్ డిమాండ్

ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఏపీలో యుద్ధ వాతావరణం క్రియేట్ చేయాలని జగన్ భావిస్తున్నాడని.. నిజంగా జగన్ యుద్ధమే కోరుకుంటే తాము సిద్ధంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం, తనను తెలంగాణ బోర్డర్‌లో అడ్డుకున్న విధానం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని.. పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడ నిజంగా జగన్ యుద్ధమే కోరుకుంటే తాము సిద్ధంగా ని పవన్ ఆరోపించారు. అటు గత నాలుగున్నరేళ్లలో జగన్ ఒక్క ప్రెస్‌మీట్ కూడా పెట్టలేదని.. దమ్ముంటే ఒక ప్రెస్‌మీట్ పెట్టాలని సాక్షి మీడియా సహా జర్నలిస్టు మిత్రులు అడగాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఎంతసేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణలను ప్రశ్నలు అడగటం కాదని.. సాక్షి యజమానిని కూడా ప్రశ్నించాలని ఎద్దేవా చేశారు.

ఏపీలో అరాచక పాలన సాగుతోందని.. ఇచ్చిన హామీలు నెరవేర్చని నాయకుడు జగన్ అని పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. మద్యపాన నిషేధం అని చెప్పి దొంగ హామీ ఇచ్చారని.. ఈరోజు మద్యంలో వచ్చే ఆదాయంలో మూడో వంతు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. ఇసుక, మైనింగ్‌ను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని పవన్ అన్నారు. దేశానికి బలమైన నాయకుడు కావాలని 2014లో మోదీకి మద్దతు ఇచ్చానని.. అలాగే రాజధాని లేని రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు అవసరం కాబట్టి చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. ప్రత్యే్క హోదాకు సంబంధించి విభేదాలు రావడం వల్లే 2019లో టీడీపీతో కలవలేదన్నారు. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ అధికారికంగా ఈరోజు ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ లేదని కూడా స్పష్టం చేశారు.మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు హస్తం ఎలా ఉంటుందని.. ఆయన ఏమైనా సంతకాలు పెట్టారా.. సంతకాలు పెడితే ఆధారాలు చూపాలని సీఐడీ అధికారులకు పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు.

ప్రతిపక్ష నేతలను వేధిస్తున్న అధికారులు, వైసీపీ నేతలు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలని.. సొంత అమ్మ, చెల్లిని పక్కన పెట్టి.. బాబాయ్ హత్య చేసిన వ్యక్తికి మీరెంత అని ఆలోచించుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. తాము అధికారంలోకి వచ్చాక ఎవ్వరినీ వదిలిపెట్టబోమని.. జగన్‌కు ఇంకా మిగిలింది ఆరు నెలలేనని పవన్ గుర్తు చేశారు. చంద్రబాబుతో విభేదాలు ఉన్నా.. అభిప్రాయ భేదాలు ఉన్నా అవి పాలనపరమైన విషయాల వరకే పరిమితం అని పవన్ కళ్యాణ్ అన్నారు.